
వరంగల్, 14 జనవరి (హి.స.)
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందించి, తీర్థ-ప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు