
సిద్దిపేట, 14 జనవరి (హి.స.)
మత్స్య సంపద ప్రకృతిలో సహజంగా పెరిగే వనరని, శరీర ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం ప్రాజెక్టులో రొయ్య, చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్య అభివృద్ధి, స్టేట్ సెక్టార్ పథకం ద్వారా 100 శాతం రాయితీపై శనిగరం చెరువులో రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 47 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, వాటిలో 4,144 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలోని 166 చెరువులకు గాను 38 లక్షల 92 వేల చేప పిల్లలు విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందించామని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..