పొంగలి వండిన ప్రధాని మోదీ
ఢిల్లీ,14, జనవరి (హి.స.) దిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్‌ నివాసంలో జరిగిన పొంగల్‌ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పాల్గొన్నారు. ప్రజలకు పండగ శుభాంకాంక్షలు తెలిపిన ప్రధాని గోవులకు పూజ చేసి.. అనంతరం పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద
పొంగలి వండిన ప్రధాని మోదీ


ఢిల్లీ,14, జనవరి (హి.స.) దిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్‌ నివాసంలో జరిగిన పొంగల్‌ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పాల్గొన్నారు. ప్రజలకు పండగ శుభాంకాంక్షలు తెలిపిన ప్రధాని గోవులకు పూజ చేసి.. అనంతరం పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వేడుకల అనంతరం మోదీ (PM Modi) మాట్లాడుతూ.. గతేడాది తాను తమిళనాడులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. వెయ్యి సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఓ సమావేశానికి తాను హాజరైనట్లు మోదీ తెలిపారు. అక్కడ లాభదాయకమైన వృత్తులను వదిలి వ్యవసాయం వైపు మళ్లిన యువతను కలిశానని, వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande