
ఢిల్లీ,15, జనవరి (హి.స.) ఇరాన్‌తో వ్యాపారం చేసే అన్ని దేశాల పైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు (Trumps Iran Tariffs) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Congress MP Shashi Tharoor) స్పందించారు. అమెరికా విధిస్తోన్న సుంకాల వల్ల మన ప్రాంతీయ పోటీదారులతో పోలిస్తే భారత్ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల ఏ భారతీయ కంపెనీ కూడా అమెరికాకు 75 శాతం సుంకాలు చెల్లించి ఎగుమతి చేయడం సాధ్యం కాదన్నారు. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు యూఎస్ రాయబారి సెర్గియో గోర్ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
అమెరికా (US) విధిస్తోన్న ఈ సుంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని థరూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు. ఎందుకంటే ఇప్పటికే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని.. మళ్లీ ఇరాన్‌తో వ్యాపారం విషయంలో 25 శాతం సుంకాలు విధిస్తున్నారన్నారు. ఇన్ని టారిఫ్‌లను తట్టుకొని 75 శాతం సుంకాలతో అమెరికాకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం ఆచరణీయం కాదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ