పొంగలి వండిన ప్రధాని మోదీ.. తమిళ సాంస్కృతిక వారసత్వంపై ప్రశంసలు
న్యూఢిల్లీ, 14 జనవరి (హి.స.) ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పొంగలి వండి.. ఆవులకు పూజలు
ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, 14 జనవరి (హి.స.)

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పొంగలి వండి.. ఆవులకు పూజలు చేశారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తమిళులకు మోదీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తమిళనాడు రైతులను, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు. ఇది తమిళుల గొప్ప సంప్రదాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలి. అని మోదీ ఆకాంక్షించారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande