విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి.. ఐదుగురు సర్పంచ్లపై కేసులు నమోదు
కామారెడ్డి, 14 జనవరి (హి.స.) కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలపరిధిలో వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో ఏకంగా 600 కుక్కలను విషప్రయోగం చేసి చంపడం స్థానికంగా పలు గ్రామాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐదు గ్రామాల సర్పంచ్లప
కుక్కల మృతి


కామారెడ్డి, 14 జనవరి (హి.స.)

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలపరిధిలో వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో ఏకంగా 600 కుక్కలను విషప్రయోగం చేసి చంపడం స్థానికంగా పలు గ్రామాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐదు గ్రామాల సర్పంచ్లపై మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచారెడ్డి మండల పరిధిలోని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల సంఖ్య పెరిగిందని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయనే క్రమంలోనే కుక్కలను నియంత్రించేందుకు శాస్త్రీయ పద్దతులు పాటించాల్సింది పోయి, మూకుమ్మడిగా విషం పెట్టి చంపాలని సర్పంచ్లు నిర్ణయించుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 600 కుక్కలు ఈ విషప్రయోగానికి బలై మృత్యువాత పడ్డాయి.

---------------

------------

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande