
తెలంగాణ, 14 జనవరి (హి.స.)
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన డోంగ్రే చంద్రశేఖర్ (22) మృతి చెందాడు. బెజ్జూర్ మండలం కుంటల మానేపల్లి గ్రామానికి చెందిన బొర్కుట్ శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. బెజ్జూర్ మండలం మరిడి గ్రామం నుంచి కుంటల మానేపల్లికి బైక్పై వెళ్తుండగా బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మరో ప్రమాదంలో హనుమకొండ జిల్లా హసన్పర్తి హెచ్పీ గోదాం వద్ద హైవే పనులు నిర్వహిస్తున్న టిప్పర్ అతివేగంగా దూసుకొచ్చి, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో పాల వ్యాపారి ఈర కుశుడు (38) అక్కడికక్కడే మృతి చెందారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు