
కేరళ, 14 జనవరి (హి.స.)
శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన 'మకరవిలక్కు' (మకరజ్యోతి) దర్శనానికి సమయం ఆసన్నమైంది. పొన్నంబలమేడు ఇవాళ సాయంత్రం పై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తారు. సాయంత్రం దీపారాధన అనంతరం, పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిస్తుంది. సాయంత్రం సుమారు 6:30 నుంచి 6:45 మధ్య ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు