
తెలంగాణ, 14 జనవరి (హి.స.) జర్నలిస్టుల అరెస్టులపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ఓ వీడియోను. విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి వేళ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా మంచిది కాదన్నారు. అధికారుల మీద మీడియాలో ఇలాంటి వార్తలు రావడాన్ని ఎవరూ సహించరని.. అయితే, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా కథనాలు ప్రసారం చేయడం సమర్థించదగ్గ విషయం కాదన్నారు. జర్నలిస్టుల అరెస్టుల విషయంలో సిట్ అధికారులు పునరాలోచన చేయాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు