
వేములవాడ, 14 జనవరి (హి.స.)
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని బుధవారం దేవాదాయ శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ వెంకట చారి దర్శించుకున్నారు. తన కూతురైన రాజన్న ఆలయ ఈఓ రమాదేవితో కలిసి భీమన్నను దర్శించుకున్న ఆయన ముందుగా స్వామివారికి కోడె మొక్కులు, అభిషేకం వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించారు. ఇదిలా ఉండగా కూతురు ఆలయ ఈఓ అయినప్పటికీ ఎలాంటి దర్పం ప్రదర్శించకుండా, సామాన్య భక్తుడి వలే స్వామివారిని దర్శించుకోవడం, అన్ని రకాల పూజ టికెట్లు కొనుగోలు చేసి పూజలు నిర్వహించడం పట్ల ఆలయ అధికారులు, సిబ్బంది తో పాటు భక్తులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు