
అమరావతి, 14 జనవరి (హి.స.)
వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన అంబటి రాంబాబు (Ambati Rambabu) మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే తన స్టెప్పులతో అందరినీ అలరించి అబ్బురపరిచే ఆయన.. సంక్రాంతికి మరో కొత్త పాటతో సరికొత్త స్టెప్పులతో ప్రజల ముందుకొచ్చారు. అయితే పాటలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ.. అంబటి రాంబాబు వేసే స్టెప్పులు మాత్రం పార్టీలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
సంక్రాంతిని (Sankranti) పురస్కరించుకొని అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలను (Bhogi Celebrations) నిర్వహించారు. అందులో భాగంగా అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రూపొందించిన ప్రత్యేకమైన పాటను (Special Song) విడుదల చేశారు. వేడుకలకు విచ్చేసిన వారి నడుమ ఆ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. రాంబాబు అంటే పాలిటిక్స్ మాత్రమే కాదు ఫన్ విత్ ట్విస్ట్ అని నిరూపించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV