
అమరావతి, 15 జనవరి (హి.స.)
:పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులకు ‘ఫైనల్ టచ్’ ఇచ్చేందుకు విదేశీ నిపుణులు ఈ నెల 19న రానున్నారు. డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి.సిస్కో (అమెరికా), రిచర్డ్ డొనెల్లీ, సీస్ హిన్స్‌బెర్జర్ (కెనడా) మూడ్రోజులు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి.. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని, నాణ్యతను స్వయంగా పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమక్షంలో వారు 21వ తేదీ దాకా.. మూడ్రోజులపాటు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణ పనులను సమీక్షిస్తారు. తర్వాత ఢిల్లీ వెళ్లి.. భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై సూచనలతో కూడిన నివేదికను కేంద్ర జలసంఘానికి సమర్పిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ