శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి.దేవాలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
నంద్యాల 15 జనవరి (హి.స.)ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయంలో ) మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ (గురువారం) రాత్రి నంది వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చేందుకు ఆది దంప
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి.దేవాలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు


నంద్యాల 15 జనవరి (హి.స.)ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయంలో ) మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ (గురువారం) రాత్రి నంది వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చేందుకు ఆది దంపతులు (శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు) సిద్ధమయ్యారు. ఊరేగింపు అనంతరం మకర సంక్రాంతి సందర్భంగా స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande