వైసిపి నాయకుల బరి తెగింపు
అమరావతి, 15 జనవరి (హి.స.) బత్తలపల్లి(అనంతపురం): వైసీపీ( నాయకులు బరితెగించారు. టీడీపీ వర్గీయుల ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో బుధవారం సాయంత్రం ట్రాక్టర్‌లతో స్టంట్లు చేస్తూ హల్‌చల్‌ చేశారు. వారి దాడిలో టీడీపీ కార్
వైసిపి నాయకుల బరి తెగింపు


అమరావతి, 15 జనవరి (హి.స.)

బత్తలపల్లి(అనంతపురం): వైసీపీ( నాయకులు బరితెగించారు. టీడీపీ వర్గీయుల ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో బుధవారం సాయంత్రం ట్రాక్టర్‌లతో స్టంట్లు చేస్తూ హల్‌చల్‌ చేశారు. వారి దాడిలో టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్‌, ఆయన తల్లి నాగలక్ష్మి, మరో మహిళ నాగజ్యోతి గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు, వైసీపీ నాయకులు అనుమతి లేకుండా పోట్లమర్రి చెరువు మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి ట్రాక్టర్లను సీజ్‌ చేసి, తహసీల్దారుకు అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande