
తాడేపల్లిగూడెం15 జనవరి (హి.స.)
: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ రెండో రోజు రూ.కోట్లలో నగదు చేతులు మారింది. పైబోయిన వెంకటరామయ్య బరిలో భారీగా కోడి పందేలు సాగాయి. గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. ఈ పందెం గెలిచి రాజమండ్రి రమేష్ రూ.1.53 కోట్లు సొంతం చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద భారీ పందెం అని స్థానికులు చెబుతున్నారు. సమయం, జాతకం, ముహూర్తం చూసుకుని మరీ పందెం రాయుళ్లు తమ కోళ్లను బరిలో దించుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ