అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల వేడుక.. సంక్రాంతి సంబరాల్లో అక్కినేని కుటుంబం!
హైదరాబాద్, 15 జనవరి (హి.స.) హైదరాబాదులోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ''అన్నపూర్ణ స్టూడియోస్'' స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, అక్కినేని కుటుంబం సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. 1976లో లెజెండరీ నటుడు అక్కిన
అక్కినేని కుటుంబం


హైదరాబాద్, 15 జనవరి (హి.స.)

హైదరాబాదులోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'అన్నపూర్ణ స్టూడియోస్' స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, అక్కినేని కుటుంబం సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. 1976లో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) సంక్రాంతి పండుగ రోజున ఈ స్టూడియోను ప్రారంభించారు. నాన్నగారి దార్శనికతకు నిదర్శనమైన ఈ గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకోవడం పట్ల అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియోను పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఏడాది సంక్రాంతి వేడుకలకు మరో ప్రత్యేకత తోడైంది. కొత్త జంట నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు ధరించి వచ్చిన ఈ జంట, స్టూడియో ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఏఎన్నార్ కాలం నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అక్కినేని వారసులు స్వయంగా స్టూడియో సిబ్బందికి పండుగ విందును వడ్డించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande