ఈసారి యూపీలో అధికారం మనదే.. మాయావతి సందేశం
లక్నో (యు.పి,) 15 జనవరి (హి.స.) ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారంలోకి వస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధీమా వ్యక్తం చేశారు. గురువారం 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్నోలో మాయావతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్పై
మాయావతి


లక్నో (యు.పి,) 15 జనవరి (హి.స.)

ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారంలోకి వస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధీమా వ్యక్తం చేశారు. గురువారం 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్నోలో మాయావతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఈ పార్టీలకు తగిన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో 'రాజ్యాంగ వ్యతిరేక' బీజేపీని సవాల్ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరిగి బీఎస్పీ అధికారంలోకి రాబోతుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. దేశ వ్యాప్తంగా బీఎస్పీని బలోపేతం చేయాలంటే.. యూపీలో అధికారంలోకి రావాల్సి ఉందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande