
విశాఖపట్న15 జనవరి (హి.స.)
ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్.. విశాఖలో తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. కాపులుప్పాడలోని 22.19 ఎకరాల్లో చేపట్టిన శాశ్వత క్యాంపస్‌కు గతేడాది డిసెంబరు 12న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అదే సమయంలో హిల్-2లోని మహతి బ్లాక్‌లో తాత్కాలిక కార్యాలయ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులు 500 మందిని బేస్ లొకేషన్ ప్రాతిపదికన విశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు సైతం ఇచ్చారు. మరో 300 మంది సీనియర్ ఉద్యోగులను ఇక్కడికి బదిలీ చేశారు. లాజిస్టిక్, ఆపరేషనల్ సమస్యలను పరిష్కరించి ఈనెల 26వ తేదీ నుంచి కార్యకలాపాలకు పచ్చజెండా ఊపనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ