
హైదరాబాద్, 15 జనవరి (హి.స.)
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం వెలువరించారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిరాయింపులకు సంబంధించి సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వారి మీద దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదే కేసులో గతంలోనూ ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్లకు సంబంధించిన కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..