
ఖమ్మం, 15 జనవరి (హి.స.)
మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. గురువారం నదులలో పర్యటించిన డిప్యూటీ సీఎం కార్యక్రమంలో భాగంగా మధిర మున్సిపాలిటీలో వరద నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రతిపాదించిన పనుల కోసం మున్సిపల్ & అర్బన్ డెవలప్మెంట్ శాఖ నుంచి రూ.140 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఇంటి నుంచి వచ్చే మురుగు నీటిని తరలించేందుకు ఇప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా మంజూరైన భారీ నిధులతో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ రూ.140 కోట్లు మంజూరయ్యాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు