
హైదరాబాద్, 15 జనవరి (హి.స.)
హైదరాబాద్ పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య మొదలైన స్వల్ప వివాదం కాస్త పెద్ద ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన తోపులాట, రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
ఈ ఘర్షణల ఉన్నతాధికారులు పురానాపూల్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా బహదూర్ పుర నుండి పురానాపూల్ వెళ్లే ప్రధాన రహదారిని పోలీసులు పూర్తిగా బ్లాక్ చేశారు. వాహనదారులను ఇతర మార్గాల్లోకి మళ్లించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు