హైదరాబాద్లో రిచెస్ట్ పర్సన్స్ వీళ్ళే! దేశంలోనే మూడవ స్థానం
హైదరాబాద్, 15 జనవరి (హి.స.) హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత ధనికులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. 2025-2026 సంవత్సరాలకు సంబంధించిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్, ఫోర్బ్స్ ఇండియా హైదరాబాద్లోని ధనికుల జాబితా విడుదల చేసింది. వీరి అంచనాల ప్రక
రిచెస్ట్ పర్సన్


హైదరాబాద్, 15 జనవరి (హి.స.)

హైదరాబాద్ భారతదేశంలోనే

అత్యంత ధనికులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. 2025-2026 సంవత్సరాలకు సంబంధించిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్, ఫోర్బ్స్ ఇండియా హైదరాబాద్లోని ధనికుల జాబితా విడుదల చేసింది. వీరి అంచనాల ప్రకారం.. డివీస్ ల్యాబొరేటరీస్కు చెందిన మురళి దివి కుటుంబం సుమారు 5.91,100 కోట్ల నెట్ వర్తో హైదరాబాద్లోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ గా ఉన్నారు. రెండవ స్థానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)కు చెందిన పి. పిచ్చి రెడ్డి రూ.42,650 కోట్లు, మూడవస్థానంలో పి.వి. కృష్ణ రెడ్డి రూ.41,810 కోట్లు, నాలుగవ స్థానంలో హెటెరో ల్యాబ్స్క చెందిన బి. పార్థసారధి రెడ్డి రూ.39,030 కోట్లు, ఐదవ స్థానములో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కు చెందిన కే. సతీష్ రెడ్డి కుటుంబం రూ.39,000 కోట్లు, 6వ స్థానంలో రూ.35,000 కోట్లతో ఔరోబిందో ఫార్మాకు చెందిన పి.వి. రామ్ ప్రసాద్ రెడ్డి, బయాలజికల్ ఈ సంస్థను నడిపిస్తున్న మహిమ దత్ల ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande