ఐఏఎస్‌ ఎపిసోడ్‌.. దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి: మంత్రి పొన్నం
కరీంనగర్‌, 15 జనవరి (హి.స.)మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగా మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు చట్టం తన పని తాను చేస్తుంది. దీని వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదు. మహిళలను, మ
ఐఏఎస్‌ ఎపిసోడ్‌.. దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి: మంత్రి పొన్నం


కరీంనగర్‌, 15 జనవరి (హి.స.)మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగా మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు చట్టం తన పని తాను చేస్తుంది. దీని వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదు. మహిళలను, మహిళా అధికారులను, మహిళా జర్నలిస్టులను అవమానపరిచేలా కథనాలు ఇవ్వడం సరికాదు. దమ్ముంటే ఆధారాలతో బయటపెట్టాలి.

మా ప్రభుత్వం రాకముందు కూలిపోయిన కాళేశ్వరం కూడా మేమే పేల్చామని అబద్ధం ప్రచారం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande