
హైదరాబాద్, 15 జనవరి (హి.స.) తెలంగాణ రాష్ట్రప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి తెలుగు ప్రజలకు మరెన్నో సంతోషకరమైన క్షణాలు అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ ప్రియమైన కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా మరోవైపు తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ సీనియర్నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చని తోరణాలు, పసిడి కాంతులు, పాడి పంటలతో ఈ సంక్రాంతి పండుగ మీకు సుఖ సంతోషాలు, అప్లైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్రావు తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..