శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రుల ప్రత్యేక పూజలు
హనుమకొండ, 15 జనవరి (హి.స.) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం లోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు గురువారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు న
మంత్రి పొన్నం


హనుమకొండ, 15 జనవరి (హి.స.) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం లోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు గురువారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ముఖద్వారం వద్ద నూతనంగా నిర్మించిన త్రిశూల చౌరస్తాను మంత్రులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో భక్తుల రాక అధికంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధి, మాడవీధులు తదితర పనుల కోసం రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande