
ఢిల్లీ,15, జనవరి (హి.స.)
పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లీ పునరుద్ధరించేందుకు.. అలాగే, భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ‘రెండవ తరం’ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించేందుకు ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI), పాక్ సైన్యం భారీ కుట్రకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని భద్రతా సంస్థలు తాజాగా బయట పెట్టాయి. ఐఎస్ఐ ప్రస్తుతం ఉగ్రవాదంలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లాంటి పాత తరం ఉగ్రవాదుల నుంచి వారి కుమారులు, సన్నిహిత బంధువులకు నాయకత్వ బాధ్యతలను బదలాయిస్తోంది. ఉగ్రవాద సంస్థల్లో కొత్త రక్తాన్ని నింపి, కార్యకలాపాలను నిరంతరంగా కొనసాగించడమే ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇటీవల పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో ఐఎస్ఐ అధికారులు, పాక్ సైన్యం ప్రతినిధులతో పాటు వివిధ ఉగ్రవాద సంస్థల కీలక నేతల మధ్య ఉన్నత స్థాయి రహస్య సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో జమ్మూ- కాశ్మీర్‌లోకి భారీగా చొరబాట్లు చేయడం, సమన్వయంతో ఉగ్రదాడులు చేపట్టడంపై చర్చించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ