
ఖమ్మం, 15 జనవరి (హి.స.)
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి
పల్టీలు కొట్టడం తో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. నలుగురు యువకులు కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి అత్యంత వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా, దోమల మధు (22) అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మిగిలిన ముగ్గురిని స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోట మధు అనే మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఇద్దరు యువకులు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు