
మధ్యప్రదేశ్, 15 జనవరి (హి.స.)
పండగపూట రోడ్డు ప్రమాదం చోటు
చేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని బెరాసియాలో చోటుచేసుకుంది. ఒక ట్రాక్టర్-ట్రాలీ, పికప్ వాహనం ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెరాసియా పరిధిలోని విద్యా విహార్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా పికప్ వాహనంలోని వారని సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగారు. బెరాసియా ఎస్ఈఎం (SDM) అశుతోష్ శర్మ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ, మృతుల సంఖ్యను ధృవీకరించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు మీడియాకు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు