తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ తేదీలు ఖరారు...
హైదరాబాద్, 15 జనవరి (హి.స.) తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ఖరారు చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరక
సర్పంచులకు శిక్షణ


హైదరాబాద్, 15 జనవరి (హి.స.)

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ఖరారు చేసింది.

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు.. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (టీజీఐఆర్డీ) ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి వచ్చే 21 వరకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణ సందర్భంగా సర్పంచులకు వారి విధులు, నిధులు, బాధ్యతలు, హక్కులు, పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. సర్పంచ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించి కరదీపికను అందజేయనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande