ప్రేమ వివాహాల తర్వాత వారిలో ప్రేమ ఉండటం లేదు.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, 15 జనవరి (హి.స.) ప్రేమ వివాహం తర్వాత వైవాహిక ఒక సంబంధాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మ్యాట్రిమోనియల్ (వైవాహిక) కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న స్పందిస్తూ, ప్రస్తుత కాలంలో మారుతున్న బంధా
సుప్రీంకోర్టు ఆసక్తికర


హైదరాబాద్, 15 జనవరి (హి.స.)

ప్రేమ వివాహం తర్వాత వైవాహిక ఒక సంబంధాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మ్యాట్రిమోనియల్ (వైవాహిక) కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న స్పందిస్తూ, ప్రస్తుత కాలంలో మారుతున్న బంధాల తీరుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రేమ వివాహాల విషయంలో.. పెళ్లికి ముందు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, పెళ్లి జరిగిన తర్వాత ఆ బంధంలో ప్రేమ క్రమంగా తగ్గిపోతోందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, పెద్దలు కుదిర్చన వివాహాల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో దంపతుల మధ్య ప్రారంభంలో పరిచయం లేకపోయినా, వివాహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ప్రేమ క్రమంగా పెరుగుతుందని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande