
తెలంగాణ, 15 జనవరి (హి.స.)
ఇటీవల మహిళా IAS అధికారి మీద
వార్తా కథనాలు ప్రసారం, అనంతరం జర్నలిస్టుల అరెస్టు చేసిన వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. మహిళా ఐఏఎస్ అధికారిపై ఎన్టీవీలో వచ్చిన డిఫమేటరీ వార్తల వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని, రాజకీయ లాభం కోసం ఆ పార్టీ ఈ వార్తలు చేయించిందని మల్లన్న హాట్ కామెంట్స్ చేసారు. కేటీఆర్, హరీశ్రావు ఎన్టీవీ అరెస్టులపై తీవ్రంగా స్పందించడం మీడియాపై ప్రేమతో కాదని, తమ తప్పులు, రహస్యాలు బయటపడతాయనే భయంతోనేనని డ్రామాలు ఆడారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు