
తిరుమల, 15 జనవరి (హి.స.)
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. సంక్రాంతి పండుగ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేస్తున్నారు. మరోవైపు పిల్లలకు, ఆఫీసులకు సెలవులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ పెరగటంతో కంపార్టు మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో కృష్ణ తేగ గెస్ట్ హౌస్ నుండి క్యూలైన్ కొనసాగుతోంది. ఎస్ఎస్డీ టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి దాదాపుగా 14 నుండి 16 గంటల వరకు సమయం పడుతోంది. ఇక బుధవారం 76,289 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు.హుండీ ద్వారా రూ.3.844 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV