
ఢిల్లీ,15, జనవరి (హి.స.)
ఎన్‌సీఆర్‌లో గురువారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో, విజిబులిటీ తగ్గిపోయింది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి నౌకాస్ట్ ఢిల్లీపై రాబోయే రెండు గంటల పాటు ఒక మోస్తరు పొగమంచు ఉంటుందని హెచ్చరించింది. అనేక చోట్ల విజిబులిటీ 50 మీటర్ల కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అలాగే, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లను కూడా పొగ మంచు ప్రభావితం చేసింది. ఉదయం 7 గంటల తర్వాత పొగమంచు తీవ్రమవుతుందని.. ఇది వాహనాలు, విమానాల రాకపోకలను ప్రభావితం చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా.. ప్రయాణీకులను అలర్ట్ చేసింది. పొగ మంచు కారణంగా పలు ఎయిర్ ఇండియ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. విమానాల మళ్లింపు, రద్దులపై ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంటుందని.. ప్రయాణికులు సహకరించాలని కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ