
తిరుపతి: 15 జనవరి (హి.స.)వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ అనంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా భక్తులు తరలివస్తున్నారు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించి 10వేల ఉచిత టోకెన్లను తితిదే జారీ చేసింది. సంక్రాంతిని పురస్కరించుకొని తిరుపతిలోని కపిల తీర్థం వద్ద పెద్దలకు, పూర్వీకులకు తర్పణాలు వదిలేందుకు నగరవాసులు బారులు తీరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ