సైనిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ, 15 జనవరి (హి.స.) సైనిక దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఎక్స్ వేదిక‌గా దేశ సైనికుల‌కు, వారి కుటుంబాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడటంలో భారత సైన్యం ఎల్లప్పుడూ దృఢంగా నిలుస్తుందని పేర
Droupadi Murmu


ఢిల్లీ, 15 జనవరి (హి.స.)

సైనిక దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఎక్స్ వేదిక‌గా దేశ సైనికుల‌కు, వారి కుటుంబాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడటంలో భారత సైన్యం ఎల్లప్పుడూ దృఢంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మన సైనికులు మన సరిహద్దులను కాపాడుతూ విపత్తులు మరియు మానవతా సంక్షోభాల సమయంలో కీలకమైన సహాయాన్ని అందిస్తారని అన్నారు.

సైనికుల అచంచ‌ల‌మైన దేశమే ముందు అనే స్పూర్తి ప్ర‌తి భార‌తీయుడికి స్పూర్తినిస్తూనే ఉంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్ర‌తిఏడాది జ‌న‌వ‌రి 15న భార‌త సైనిక దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. 1949లో ఫీల్డ్ మార్ష‌ల్ కేఎం. క‌రియ‌ప్ప మొద‌టి కమాండ‌ర్ ఇన్ చీఫ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో ఆరోజునే సైనికుల దినోత్స‌వం జ‌రుపుకుంటున్నారు. ఇది సైన్యం యొక్క స్వాలంబ‌న‌ను సూచిస్తుంది. అంతే కాకుండా సైన్యం యొక్క ధైర్య సాహ‌సాల‌ను గౌర‌విస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande