
నెల్లూరు, 15 జనవరి (హి.స.)ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్ రాయలసీమ లిఫ్ట్‌ను తాకట్టు పెట్టారని ఆరోపించారు. అప్పట్లో తెలంగాణలో అన్న కేసీఆర్ సీఎం అయితే.. ఏపీలో తమ్ముడు జగన్ సీఎం.. ఇద్దరిదీ విడదీయలేని అనుబంధం అంటూ ఎద్దేవా చేశారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని తెలిపారు. 2024 వరకు దాదాపు నాలుగేళ్ల పాటు, ఇద్దరూ సీఎంలుగా ఉన్న సమయంలో స్టే కొనసాగిందని చెప్పారు
2.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ