
అమరావతి, 16 జనవరి (హి.స.)కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని వారికి స్పష్టం చేశామని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒక సంఘంగా ఏర్పడి.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులకు సూచించినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మానిటరింగ్ చేసుకోవాలని వారికి తెలిపానని పేర్కొన్నారు. గురువారం రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో రైతులు సమావేశమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ