
అనంతపురం , 16 జనవరి (హి.స.):ఉచితం మాటున వ్యాపారులు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తూ, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సామాన్యులు తమ నిర్మాణాలకు ఇసుక దొరకడం లేదని వాపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ