బైక్ రే‌స్‌లు.. యువకులను పొట్టుపొట్టు కొట్టిన గ్రామస్తులు
హిందూపురం , 16 జనవరి (హి.స.) ఏపీలోని సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. కొల్లకుంట వద్ద కొందరు యువకులు బైక్ రేసింగ్ చేస్తూ ఓ వ్యక్తికి ఢీ కొట్టారు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిదే తప్పు అంటూ గొడవపెట్టుకుని దాడికి పాల్పడ్డారు.
బైక్ రేసింగ్ చేస్తూ వ్యక్తిని ఢీకొన్న రేసర్లు... చితకబాదిన గ్రామస్థులు


హిందూపురం , 16 జనవరి (హి.స.)

ఏపీలోని సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. కొల్లకుంట వద్ద కొందరు యువకులు బైక్ రేసింగ్ చేస్తూ ఓ వ్యక్తికి ఢీ కొట్టారు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిదే తప్పు అంటూ గొడవపెట్టుకుని దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు యువకులను ప్రశ్నించడంతో వారిపైనా ఎదురుదాడికి దిగారు. దీంతో గ్రామస్తులు యువకులను పట్టుకుని చితకబాదారు.

యువకులను అక్కడ నుండి కదలనివ్వకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు గ్రామస్తులు చేసిన పనికి ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ యువకులు బైర్ రేసింగ్ కు పాల్పడుతూ వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. బైక్ రేసింగ్ ల వల్ల సామాన్య ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande