ముంబైలో “రిసార్ట్” పాలిటిక్స్.. స్టార్ హోటల్‌లో షిండే సేన కార్పొరేటర్లు.
ముంబై,18, జనవరి (హి.స.) బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ+శివసేన(షిండే) కూటమి సంచలన విజయం సాధించింది. గత రెండు దశాబ్ధాలుగా నగరంపై ఉన్న ఠాక్రేల ఆధిపత్యాన్ని కూల్చేసింది. అయితే, ఇప్పుడు ముంబైలో ‘‘రిసార్ట్’’ రాజకీయాలు మొదలయ్
ముంబైలో “రిసార్ట్” పాలిటిక్స్.. స్టార్ హోటల్‌లో షిండే సేన కార్పొరేటర్లు.


ముంబై,18, జనవరి (హి.స.) బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ+శివసేన(షిండే) కూటమి సంచలన విజయం సాధించింది. గత రెండు దశాబ్ధాలుగా నగరంపై ఉన్న ఠాక్రేల ఆధిపత్యాన్ని కూల్చేసింది. అయితే, ఇప్పుడు ముంబైలో ‘‘రిసార్ట్’’ రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచిన షిండే శివసేన తన కార్పొరేటర్లను ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించడం ప్రారంభించింది. దేశంలోనే అత్యంత ధనిక పౌరసంస్థ అయిన ముంబైలో కొత్త పాలక వర్గం కొలువుదీరే ముందు రాజకీయాలు మొదలయ్యాయి.

ఈ రిసార్ట్ పాలిటిక్స్ ముందు రెండు ప్రధాన కోణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యే అవకాశం ఉన్నందున షిండే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా, మరో కారణం ఏంటంటే.. మేయర్ పదవిని తామే సొంతం చేసుకునే యోచనలో షిండే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో బేరసారాలను నడిపించేందుకు తన కార్పొరేటర్లను హోటల్‌కు తరలిస్తున్నట్లు సమచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande