
మహారాష్ట్ర, 18 జనవరి (హి.స.)
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మహారాష్ట్రలోని పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై మోహోల్ సమీపంలోని దేవీ పాటి వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు రాయగడ జిల్లా పన్వెల్ నుంచి సోలాపూర్ జిల్లాలోని అక్క్కల్కోట్కు దైవదర్శనం కోసం ఎర్టిగా కారులో వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..