భారత్ పై ఒత్తిడి తేవాలని ట్రంప్ కు అమెరికా సెనేటర్ల లేఖ
హైదరాబాద్, 18 జనవరి (హి.స.) అమెరికా నుంచి భారతదేశానికి ఎగుమతి అవుతున్న పప్పు దినుసులపై భారత్ విధిస్తున్న 30 శాతం టారిఫ్ లను తొలగించేలా ఒత్తిడి తేవాలని కోరుతూ అమెరికన్ సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాశారు. గతేడాది అక్టోబర్ 30న అమెరికన్ ఎల్లో ప
అమెరికా


హైదరాబాద్, 18 జనవరి (హి.స.)

అమెరికా నుంచి భారతదేశానికి

ఎగుమతి అవుతున్న పప్పు దినుసులపై భారత్ విధిస్తున్న 30 శాతం టారిఫ్ లను తొలగించేలా ఒత్తిడి తేవాలని కోరుతూ అమెరికన్ సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాశారు. గతేడాది అక్టోబర్ 30న అమెరికన్ ఎల్లో పీస్ (బటానీలు/పప్పు) ఎగుమతులపై భారత్ హఠాత్తుగా 30 శాతం సుంకాన్ని విధించిందని, దీనివల్ల అమెరికా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వారు తమ లేఖలో ప్రస్తావించారు.

భారత్తో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, అమెరికన్ వస్తువులకు భారత మార్కెట్లో మెరుగైన ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ట్రంప్ను సెనేటర్లు కోరారు. ఈ టారిఫ్ల విధింపు వల్ల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడుతుందని, వీటిని వెంటనే తొలగించేలా భారత్పై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. అగ్రరాజ్యం నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ పెద్ద మార్కెట్ అయిన నేపథ్యంలో, ఈ సుంకాల వ్యవహారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య కీలక చర్చాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande