
ముంబై, 18 జనవరి (హి.స.)
భారత్ 'విశ్వగురువు'గా నిలవాలంటే
ధర్మమే మార్గమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పుకొచ్చారు.ఈ రోజు ఉదయం ముంబైలో జరిగిన 'విహార్ సేవక్ ఊర్జా మిలాన్'లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ధర్మం అనేది మనందరినీ నడిపించే చోదక శక్తి అని, ధర్మం అనే 'వాహనం'లో ప్రయాణిస్తే మనకు ఎన్నటికీ 'ప్రమాదం' జరగదని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ విశ్వమంతా ధర్మంపైనే ఆధారపడి నడుస్తుంది.. ఒక రాజ్యం లౌకిక రాజ్యం గా ఉండవచ్చు కానీ, ఏ జీవి లేదా నిర్జీవ వస్తువు ధర్మం లేకుండా మనుగడ సాగించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రవహించడం నీటి ధర్మం అయినట్లే, ప్రతిదానికీ ఒక ధర్మం ఉంటుందని, ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన ప్రస్తుత ప్రపంచానికి ధర్మం ద్వారానే భారత్ 'విశ్వగురువు'గా దిశానిర్దేశం చేయగలదని ఆయన వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..