
ఢిల్లీ18,, జనవరి (హి.స.) ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. యూపీలోని అమ్రోహా జిల్లా, షావజ్‌పూర్ గ్రామం వద్ద ఢిల్లీ-లఖ్నవూ రహదారిపై భారీ ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్నవి కనిపించక వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది గాయాలపాలయ్యారు. 10 వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
యాక్సిడెంట్ కారణంగా రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాలా సేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు క్రేన్లను రంగంలోకి దించారు. ధ్వంసమైన వాహనాలను క్రేన్‌తో పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ