ఇండిగో సంక్షోభం.. DGCA భారీ జరిమానా
ఇండిగో కు ఏకంగా 22.2 కోట్ల జరిమాన కూడా విధిస్తూ ప్రకటన చేసింది DGCA.
Indigo Airlines


ఢిల్లీ, 18 జనవరి (హి.స.)ఇటీవల కాలంలో ప్రయాణికులకు ఇండిగో చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో విమానాలు రద్దు, వాయిదా పడడంతో ప్రయాణికులు చాలా కష్టాలు పడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం పైన చర్చ జరిగింది. ఇండిగో విమాన సంస్థను రద్దు చేయాలని కూడా చాలామంది ప్రయాణికులు సీరియస్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA ) స్పందించింది. ఇండిగో సంక్షోభం కారణంగా తాజాగా భారీ జరిమానా విధించింది DGCA. డిసెంబర్ మాసంలో కొన్ని రోజులపాటు కొనసాగిన ఈ సంక్షోభం పైన చర్యలు తాజాగా తీసుకుంది.

ఇండిగో కు ఏకంగా 22.2 కోట్ల జరిమాన కూడా విధిస్తూ ప్రకటన చేసింది DGCA. అక్కడితో ఆగకుండా 50 కోట్ల బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. రాబోయే మాసాలలో తనిఖీలు చేసి దశలవారీగా ఆ డబ్బు రిలీజ్ చేస్తామని వివరణ ఇచ్చింది. ఇంప్రూవ్మెంట్ చూపించాలని కూడా DGCA ప్రకటన చేసింది. కాగా ఇండియాలో నడిచే విమానాలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA ) ఆధీనంలో ఉంటాయన్న సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande