ఇందౌర్‌ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత: రాహుల్‌
ఇందౌర్‌: 18,,జనవరి (హి.స.) మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగిన కలుషిత నీటి మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భాగీరథ్‌పుర ప్రాంతంలో కలుషిత జలాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితులను
Congress MP and leader Rahul Gandhi


ఇందౌర్‌: 18,,జనవరి (హి.స.)

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగిన కలుషిత నీటి మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భాగీరథ్‌పుర ప్రాంతంలో కలుషిత జలాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితులను రాహుల్‌ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం, కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘చాలా నగరాల్లో ఇదే జరుగుతోంది. స్వచ్ఛమైన నీటిని అందించడం, కాలుష్యాన్ని నియంత్రించడమనేది ప్రభుత్వ బాధ్యత. వీటిని ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటే దానిని వారు నిర్వర్తించాలి. వీళ్లు(బాధితులు) అదే కోరుకుంటున్నారు. వారికి మద్దతు ఇవ్వడానికే వచ్చాను. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. కావాలంటే దీన్ని రాజకీయమని పిలవండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను వీరికి మద్దతు ఇవ్వడానికి వచ్చాను.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande