రిపబ్లిక్‌ డేకు ఉగ్ర ముప్పు
దిల్లీ:18,,జనవరి (హి.స.) ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ఉగ్ర సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్‌ కేంద్రంగా పని చేస్తున్న సంస్థలు దిల్లీసహా దేశంలోని ప్రముఖ నగరాల్లో దాడులకు ప్రయత్నించవచ్చని తెలిపాయి.
రిపబ్లిక్‌ డేకు ఉగ్ర ముప్పు


దిల్లీ:18,,జనవరి (హి.స.)

ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ఉగ్ర సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్‌ కేంద్రంగా పని చేస్తున్న సంస్థలు దిల్లీసహా దేశంలోని ప్రముఖ నగరాల్లో దాడులకు ప్రయత్నించవచ్చని తెలిపాయి. దేశ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు ఖలిస్థానీ, ఇతర రాడికల్‌ హ్యాండ్లర్లు స్థానిక గ్యాంగ్‌స్టర్లను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. హరియాణా, పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపాయి. గతేడాది దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలపై అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీ సహా ఇతర ప్రముఖ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande