
ఢిల్లీ,19,, జనవరి (హి.స.) తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని.. విజయ్ ఆలస్యంగా రావడమూ ఒక కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. గంటలపాటు ఎదురుచూసి కనీస మంచినీరు లేక డీహైడ్రేషన్‌కు గురై తొక్కిసలాటలో చనిపోయారని అభియోగాల్లో పేర్కొన్నారు. ఈ కేసులో టీవీకే నేతలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే.. విజయ్‌పై మాత్రం నేరారోపణలు నమోదు కాలేదు. పలు నాటకీయ పరిణామాల తర్వాత ఈ ఘటనపై సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది సుప్రీం కోర్టు.
కరూర్ ఘటనకు సంబంధించి టీవీకే నేతలను ప్రశ్నించిన సీబీఐ.. విజయ్ కరూర్‌ర్యాలీ కోసం ఉపయోగించిన ప్రచార రథాన్ని కూడా సీజ్ చేసింది. అలాగే విచారణలో భాగంగా.. జనవరి 12వ తేదీన సాక్షి హోదాలో విజయ్‌ను ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్‌లో ఆరున్నర గంటలపాటు ప్రశ్నించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ