కాశ్మీర్‌లో ‘ఉగ్ర’వేట.. ఏడుగురు సైనికులకు గాయాలు..
జమ్మూ , 19,జనవరి (హి.స.) కాశ్మీర్‌లో కిష్త్వార్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం మధ్యాహ్నం నుంచి కాల్పులు ప్రారంభయ్యాయి. సైన్యానికి చెందిన ఏడుగురు సైనికులు ఈ ఆపరేషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. కఠిమై
కాశ్మీర్‌లో ‘ఉగ్ర’వేట.. ఏడుగురు సైనికులకు గాయాలు..


జమ్మూ , 19,జనవరి (హి.స.) కాశ్మీర్‌లో కిష్త్వార్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం మధ్యాహ్నం నుంచి కాల్పులు ప్రారంభయ్యాయి. సైన్యానికి చెందిన ఏడుగురు సైనికులు ఈ ఆపరేషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. కఠిమైన పర్వత ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. దీనికి ‘‘ఆపరేషన్ త్రాహి-1’’ అని పేరు పెట్టారు. భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. చత్రూ ప్రాంతంలోని సొన్నార్‌లో తనిఖీలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.

పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఇద్దరు, ముగ్గురు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రతా బలగాల వలయాన్ని ఛేదించేందుకు ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరినట్లు చెప్పారు. దీనికి ప్రతిగా సైన్యం దాడుల్ని పెంచిందని, గాయపడిన సైనికుల్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్‌ పోలీసుల్ని మోహరించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande