భాగస్వాములను దెబ్బతీయడమే భాజపా వ్యూహం: కపిల్‌ సిబల్‌
దిల్లీ: 19,జనవరి (హి.స.) భాజపాపై రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధికారం/మెజారిటీ లేని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలను పక్కన పెట్టేయడం అనే వ్యూహాన్ని అమలు చే
భాగస్వాములను దెబ్బతీయడమే భాజపా వ్యూహం: కపిల్‌ సిబల్‌


దిల్లీ: 19,జనవరి (హి.స.) భాజపాపై రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధికారం/మెజారిటీ లేని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలను పక్కన పెట్టేయడం అనే వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ వ్యూహం బిహార్‌లో విజయవంతమైందని, ప్రస్తుతం మహారాష్ట్రలో అమలు చేస్తోందని ఆరోపించారు. అందుకే ముంబయి, పుణెల్లో శివసేన, ఎన్సీపీలకు ఓడించిందని తెలిపారు. కాంగ్రెస్‌తో నేరుగా పోటీ పడే ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో భాజపా రాజీపడకుండా చూసుకుంటోందని పేర్కొన్నారు. తమిళనాడులో ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీ ఇప్పటికే అనేకసార్లు విఫలమైందని వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు దేవాలయాల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చీలికను ప్రస్తావించిన సిబల్‌.. అవకాశవాద రాజకీయాలపై హెచ్చరికలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande